హైదరాబాదులో విమానంలో రెస్టారెంట్‌ను ప్రారంభం…

ఆహార ప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు సిద్ధమైంది. నగరంలోనే మొదటిసారిగా విమానంలో రెస్టారెంట్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఎయిర్ బస్ కంపెనీకి చెందిన ఏ320 రకం పాత విమానాన్ని కేరళలో నిర్వహించిన వేలంలో రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ విమానాన్నే త్వరలో హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్ పేటలో ఫ్లైట్‌ రెస్టారెంట్ గా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా పరిసరాలను మార్చేస్తోంది. రన్ వే, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లో టికెట్లు తదితర ఏర్పాట్లను చేసింది. విమానంలో 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఎంచెక్కా విమానంలో కూర్చొని..శామీర్ పేట చెరువు అందాలను తనివి తీరా చూస్తూ, రుచికరమైన వంటకాలను ఆస్వాదించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ను తీర్చిదిద్దనున్నారు. ఇందులో మొత్తం150 సీట్లు ఉంటాయి. విమానంలోకి ప్రవేశించేందుకు వీలుగా ఎస్కలేటర్ ను కూడా నిర్మించనున్నారు…