హైదరాబాద్‌ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాం హజరు కానున్న ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రులు.. .

త్వరలో నిర్వహించనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. నగరంలోని హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌ హోటల్‌లో సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు భాజపా జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోష్‌ హైదరాబాద్‌ రానున్నారు…ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రులు, జాతీయస్థాయి ముఖ్యనేతలు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. మూడు రోజులపాటు మోదీ, అమిత్‌షా తదితరులు ఇక్కడే ఉండనున్నారు. సుమారు 300 మంది ప్రముఖులు ఉండేలా నోవాటెల్‌ వద్ద బస ఏర్పాట్లను చేస్తున్నట్లు సమాచారం. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు వ్యూహాత్మకంగానే తెలంగాణను ఎంపిక చేసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.