హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించబోతోందా..!!?

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు....ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచనల వ్యాఖ్యలు ..

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించబోతున్న ప్రధాని నరేంద్ర మోడీ..

హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతుంది… ఇండస్ట్రీలకి కానీ ఇతర సదుపాయాలకి హైదరాబాద్ చాలా అనుకూలంగా ఉంటుంది అని ఆలోచన కూడా అందరిలో వ్యక్తమౌతుంది… ప్రస్తుతం ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరం ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది… ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోనే ఎక్కువ వనరులు కానీ ఆర్థిక పరంగా గాని అన్నిటికి అనువైన పద్ధతిలో ఉందని ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది…

దేశంలో రెండో రాజధాని హైదరాబాద్ అవతరించబోతుంది.?
ఈ పార్లమెంట్ సెక్షన్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్మీ అధికారులతో కంటోన్మెంట్ ఏరియాలో కిషన్ రెడ్డి కీలక చర్చలు కొనసాగాయి..? ఎటువంటి పరిణామాలైనా ఎదురుకోవటానికి ముందు జాగ్రత్త చర్యగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు, హైదరాబాద్ కేంద్రపాలితం మంచి అవకాశం, ఎన్నికలు ఉన్నాయని నరేంద్ర మోడీ అభిప్రాయ పడుతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది… ఇదే విషయంపై ఇంకా పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది…. ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది.. ఇదే వార్త నిజం అవుతుందా అయితే కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది…… తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నడుస్తున్న సమయంలో కూడా ఇవే వార్తలు వినపడినవి అప్పుడు దీన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది హైదరాబాద్ లేని రాష్ట్రం మాకెందుకు అంటూ కూడా నిలదీసింది.. దీంతో హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది… దీంతో అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయాయి…

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచనల వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మారే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలు కూడా యూటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తున్నానని తెలిపారు.

ఢిల్లీ ఆర్డినెస్స్ పై లోక్ సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ మాట్లాడరు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అన్నారు. దీన్ని ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పోరాటాన్ని సభ బయట చూసుకోవాలన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ మనిషేనన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనల నుంచే ఆయన బయటకు వచ్చారని చెప్పారు…