హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారిణి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్..!

హైదరాబాద్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారిణి అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్..

శ్రీదేవిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు..

గతంలో ఆదిలాబాద్ జైనూర్‌లో సీడీపీఓగా పనిచేస్తున్న సమయంలో శ్రీదేవి నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తింపు

ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా కోసం చేసిన ఖర్చులుపై నకీలీ ఇండెంట్లను సృష్టించి నగదు కాజేసినట్లు దర్యాప్తులో తెల్చిన ఏసీబీ

దాదాపు రూ. 65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించిన ఏసీబీ

ఆమెను కరీంనగర్ కోర్టులో హజరుపరిచి రిమాండ్ తరిలించిన ఏసీబీ అధికారులు

322 అంగన్వాడీ సెంటర్లకు సబంధించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు తేల్చిన ఏసీబీ….

ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ సీడీపీఓగా పనిచేసిన సమయంలో నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఆరోగ్యలక్ష్మి పాల సరఫరా ఖర్చుల్లో జరిగిన అవకతవకలపై కేసు నమోదు చేశారు. నకిలీ ఇండెంట్లు సృష్టించి నగదు కాజేసినట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం రూ.65.78 లక్షలు దారి మళ్లించినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు 322 అంగన్వాడీ కేంద్రాల నిధులను దుర్వినియోగం చేశారని తెలిపారు. ఈ స్కామ్ 2015-2016 సమయంలో జరిగిందని అధికారులు వెల్లడించారు..