హైదరాబాద్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ..

R9TELUGUNEWS.COM.ప్రధాని మోదీ ఈ నెల 5న (శనివారం) హైదరాబాద్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ను సందర్శించి, సంస్థ నూతన లోగోను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ వెళ్లనున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా చినజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. *అనంతరం దిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు.