హైదరాబాద్‌లో మరో బాలికపై లైంగిక దాడి…!!

హైదరాబాద్‌లో మరో బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నెల 31న రాత్రి పది గంటల సమయంలో పహాడీ షరీఫ్‌కు చెందిన పదకొండేళ్ల బాలిక ఒంటరిగా తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది…అదే రూట్లో వెళ్తున్న క్యాబ్ డ్రైవర్ షేక్ కలీమ్ అలీ ఒంటరిగా ఉన్న బాలికను చూసి క్యాబ్ ఆపి, బాలికను ఎక్కడికి వెళ్లాలి అని అడిగాడు. తాను ఇంటికి వెళ్తున్నానని, క్యాబ్ ఎక్కేందుకు తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది. డబ్బులు లేకున్నా, ఆమె ఇంటి దగ్గర దిగబెడతానని బాలికను నమ్మించి, కారు ఎక్కించుకున్నాడు. తర్వాత మార్గ మధ్యంలో కలీమ్ అలీ, తన స్నేహితుడైన మొహమ్మద్ లుక్మాన్ అహ్మద్‌ను కారులో ఎక్కించుకున్నాడు. అయితే, కారు బాలిక ఇంటివైపు కాకుండా, లుక్మాన్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై ఇధ్దరూ కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..