పోలీసులు అదుపులో వీఐపీ బాబా..!!!

పోలీసులు అదుపులో వీఐపీ బాబా

హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో దొంగ వీఐపీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. భూతవైద్యం పేరుతో ఇప్పటివరకూ ఈ బాబా 7 పెళ్లిళ్లు చేసుకున్నాడు. దయ్యం పట్టిందని నమ్మించి, యువతులను లొంగదీసుకోవడం ఈ బాబా స్పెషాలిటీ. ఇప్పుడు ఇతను 8వ పెళ్లికి సిద్ధమయ్యాడు…పెండ్లి కోసం సుమారు 200 మంది ఫంక్షన్ హాల్ కు చేరుకున్న బంధువులు..చివిరి నిమిషంలో నికాహ్ క్యాన్సల్..

దొంగ బాబా కు పక్క రాష్ట్రం లో ఉన్న బడా రాజకీయనాయకుల అండ, లంగర్ హౌజ్ పోలీసులు అదుపులో దొంగ బాబా…

లంగర్ హౌజ్ సీఐ శ్రీనివాస్ వెల్లడిస్తూ.. ‘‘నిన్న రాత్రి 11 గంటలకు తబస్సుమ్ ఫాతిమా అనే అమ్మాయి మా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. నెల్లూరులో ఉన్న రెహ్మతాబాద్ దర్గాకి చెందిన హఫీజ్ పాషా అనే బాబా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. టోలిచౌకికి చెందిన ఫాతిమా మూడేళ్లుగా నెల్లూరు దర్గాలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి, తనని పెళ్లి చేసుకుంటానని బాబా చెప్పాడు. దీంతో హైదరాబాద్ టోలిచౌకి ఫంక్షన్ హాల్‌లో తబస్సుమ్ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే.. ఆ బాబా పెళ్లికి రాలేదు. ఎంతసేపు వేచి చూసినా రాకపోయేసరికి.. ఫిర్యాదు చేశారు. పెళ్లికూతురు తబస్సుం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం’’ అని తెలిపారు. ఈ బాబాకు గతంలో 7 పెళ్లిళ్లు అయినట్లు అమ్మాయి తరఫు బంధువులు చెప్తున్నారని, అన్ని కోణాల్లో తాము దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు….