హైద్రాబాద్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పై..బీజేపీ నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 సభ పై ప్రశ్నల ఫ్లెక్సీలు..

హైద్రాబాద్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ పై..బీజేపీ నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 సభ పై ప్రశ్నల ఫ్లెక్సీలు..

అదేవిదంగా రేపు పెరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 సభకు హాజరవుతున్న అమిత్ షా లను ప్రశ్నిస్తూ నగరంలో వెలసిన ఫ్లెక్సీలు

గోవా లిబరేషన్ డేకు 300 కోట్లు ఇచ్చిన మోడీ సర్కార్ తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేషన్ డేకు ఒక్కరూపాయి ఎందుకు ఇవ్వలేదు మరి ఇప్పుడు రేపు తెలంగాణకు వస్తున్న అమిత్ షా ఏమైనా ప్రకటిస్తారా అంటూ ప్రశ్న

తెలంగాణ లో వృద్దప్య పింఛన్ మా ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 రూపాయలు ఇస్తుంటే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇస్తున్న పింఛన్లు ఎంత?

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్న రాహుల్ సోనియా ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లో విఫలం అయ్యారు అంటూ ప్రశ్నలు

మీ హయంలో వరంగల్ నుండి ఐటీ మంత్రిగా ఉండి కూడా వరంగల్ కు ఒక్క ఐటీ కంపెనీ ఎందుకు తీసుకురాలేదు అంటూ ప్రశ్నల వర్షం

మీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రైతులకు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అంటున్నారు దానికి మీరు ఒప్పుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ కు ప్రశ్నలు ..

2004 నుండి 2014 వరకు అధికారం లో ఉన్న కాంగ్రెస్ ఎస్సి వర్గీకరణ చెయ్యలేదు ఇప్పుడు కూడా ఎస్సి డిక్లరేషన్ పేరుతొ అలానే చేస్తారా అంటు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు..