హైదరాబాద్ శివార్లలోని ఓ క్లబ్ లో కాల్పుల కలకలం రేపింది.. కారణం ఇదే..!!

కార్తీకదీపం సీరియల్ నటుడు ప్రేమ్ ..

హైదరాబాద్ శివార్లలోని ఓ క్లబ్ లో కాల్పుల కలకలం రేపింది…

శనివారం ఉదయం క్లబ్ కు వచ్చిన వారిలో ఓ యువకుడు ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, కాల్పులు జరిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్‌లో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై నటుడు మనోజ్‌ నాయుడు కాల్పులు జరిపాడు. ఎయిర్‌ గన్‌తో మనోజ్ కాల్చగా.. పిల్లెట్స్‌ నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్‌ దాస్‌ శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు…

*భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వ్యక్తిపై కాల్పులు.!!!!

కార్తీకదీపం సీరియల్ నటుడు ప్రేమ్ గుర్తున్నాడా? అతను ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. రీల్ లైఫ్‌లో అనుకునేరు..
రియల్ లైఫ్‌లో. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఎయిర్ గన్‌తో సీరియల్ నటుడు మనోజ్ కుమార్ సిద్దార్థ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఎయిర్ గన్ పిల్లెట్స్ తగిలి సిద్ధార్థ కు గాయాలయ్యాయి. మనోజ్ భార్యతో ఉన్న వివాహేతర సంబంధమే కాల్పులకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ్‌ను చంపాలని ముందుగానే నిర్ణయించుకున్న మనోజ్ కుమార్ క్లబ్ లోకి ఎయిర్ గన్ తీసుకెళ్లాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారిస్తున్నారు. కాగా.. మనోజ్ కుమార్ మౌనరాగం సీరియల్‌తో పాటు కార్తీక దీపం సీరియల్‌లో ప్రేమ్‌గా నటించాడు…