షామీర్‌పేట్‌లో కాల్పుల కలకలం..!

షామీర్‌పేట్‌లో కాల్పుల కలకలం…

మద్యం దుకాణం వద్ద కాల్పులు జరిపి దోపిడీ…

మూడు రౌండ్లు కాల్పులు జరిపి…

రెండు లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు…

హైదరాబాద్‌ శివారులో కాల్పులు కలకలం సృష్టించాయి.. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా షామీర్‌పేట్‌ దగ్గర ఓ వైన్‌ షాపు యజమాని బెదిరించి.. అతని దగ్గర ఉన్న డబ్బుతో ఉడాయించారు.. మేడ్చల్ జిల్లా ఉద్దిమర్రి దగ్గర ఈ ఘటన జరిగింది.. ఉద్దమర్రిలో మద్యం షాపు నిర్వహిస్తోన్న బాలకృష్ణ అనే వ్యక్తి.. రాత్రి వైన్‌షాపును మూసివేసి తిరిగి వెళ్తున్న సమయంలో.. దుండగులు ఎటాక్‌ చేశారు.. తుపాకీతో బెదిరించారు.. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది.. ఆ తర్వాత కర్రలతో బాలకృష్ణపై దాడి చేశారు.. అతడి దగ్గర ఉన్న రెండు లక్షల రూపాయాలతో పారిపోయారు.. ఇక, బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు.. కాల్పుల ఘటనపై పేట్‌ బషీర్‌బాగ్‌ ఏసీపీ రామలింగరాజు మాట్లాడుతూ.. మద్యం షాపు దగ్గర కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారని.. మూడు రౌండ్లు కాల్పులు జరిపి, కర్రలతో దాడి చేసి రెండు లక్షలు ఎళ్తుకెళ్లారని తెలిపారు.. దోపిడీకి పాల్పడిన సమయంలో దుండగులు మంకీ క్యాప్స్‌ ధరించి ఉన్నారని వెల్లడించారు.. కాల్పుల ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే, హైదరాబాద్‌ శివారులో జరిగిన ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది..