హైదరాబాద్‌లో మళ్లీ లోన్‌యాప్‌ ఆగడాలు.. వారం రోజుల్లో 6 కేసులు..

R9TELUGUNEWS.COM..
హైదరాబాద్‌లో లోన్‌ యాప్‌ ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. వారం రోజుల్లో ఆరు కేసులు నమోదు చేశామని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. రెండు కేసుల్లో లోన్‌ తీసుకోకుండానే డబ్బులు కట్టాలని వేధింపులకు గురి చేస్తున్నారని, వేరే ప్రాంతాల్లో ఉండి ఈ మాఫియా కార్యకలాపాలు సాగిస్తోందని ఏసీపీ వెల్లడించారు. ప్రైవేట్‌ లింక్స్‌ పంపి లోన్‌యాప్‌ మాఫియా కొత్త మోసానికి తెర తీసిందన్నారు. హైదరాబాద్‌లో లోన్‌ యాప్‌ కంపెనీలకు చెక్‌ పెట్టామని, యాప్‌డౌన్‌లోడ్‌ సమయంలోనే అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంటాక్ట్స్‌కి యాక్సిస్‌ ఉండే ఏ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మంచిది ఆకదని ఏసీపీ సూచించారు.