హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో దారుణం.. వ్యక్తి దారుణ హత్య..

హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో దారుణం జరిగింది. ఓ యువకుడిని ప్రత్యర్థులు కిరాతంగా హత్య చేశారు.సయీద్ బావజిర్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి అతి దారుణంగా హతమార్చారు. ఆఫీస్ బిల్డింగ్‌లోని మొదటి అంతస్తులోనే ఈ ఘటనకు పాల్పడ్డారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనిమానిస్తున్న పోలీసులు.. ఆ కోణంలో విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది..