హైదరాబాద్ లో 5.9 ఎక‌రాల విస్తీర్ణంలో అత్యంత సుంద‌రంగా తీర్చిదిద్దిన మ‌రో పార్క్ …

హైద‌రాబాదీల‌కు అత్యంత సుంద‌రంగా తీర్చిదిద్దిన మ‌రో పార్క్ అందుబాటులోకి వ‌చ్చింది.

గండిపేట ప‌రిధిలో అభివృద్ధి చేసిన ఎకో పార్క్‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. ఉస్మాన్ సాగ‌ర్ స‌ర‌స్సుకు వందేళ్లు నిండిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని 5.9 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను తెలంగాణ స‌ర్కారు తీర్చిదిద్దింది.
గండిపేట ఎకో పార్క్‌లో పిక్నిక్ స్పేసెస్‌తో పాటు ఉస్మాన్ సాగ‌ర్ బ్యాక్ డ్రాప్‌గా యాంఫీ థియేట‌ర్‌, ఫ్ల‌వ‌ర్ టెర్రెస్‌, వాక్ వేస్‌, 2 ఆర్ట్ పెవిలియ‌న్లు, ఫుడ్ కోర్ట‌లను ఏర్పాటు చేశారు. అవుట‌ర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ పార్క్ హైద‌రాబాదీల‌కు పిక్నిక్ స్పాట్ గా మారుతుంద‌ని మునిసిప‌ల్ శాఖ అధికారులు చెప్పారు.