అత్యవసరం అయితేనే రోడ్ల‌పై‌కి రండి…

వీలైనంత వరకు మీరు ఇంట్లోనే ఉండండి. అత్యవసరం అయితేనే రోడ్ల‌పై‌కి రండి. లేదంటే మీరు ట్రాఫిక్ లో చిక్కుకోవడం ఖాయం. అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు లు శుక్రవారం ఓ 27 సెకండ్‌ల వీడియోను రిలీజ్ చేశారు. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల‌తో రోడ్డు‌ల పై ఏర్పడే పరిస్థితులను పోలీసులు వివరించారు. అయితే ఈ వీడియో లో గురువారం ఐ‌టీ కారిడార్‌లో చోటుచేసుకున్న ట్రాఫిక్ జామ్ విజువల్స్‌ను పెట్టారు. ఈ ట్రాఫిక్ జామ్ విజువల్స్ సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తూ వైరల్‌గా మారాయి.

చలాన్‌ల విషయంలో గోడ, చెట్లు చాటు దాక్కుని ట్రాఫిక్ వయోలేషన్స్‌పై ఫోటోలు దించి చలాన్‌ల‌ను గుప్పించే ట్రాఫిక్ పోలీసు అధికారులు ట్రాఫిక్ జామ్‌లను తొలగించడానికి రోడ్ల పై ఎందుకు కనిపించరని ప్రశ్నించారు. మరో వైపు వాహనదారులు ట్రాఫిక్ అధికారుల సూచనలను పాటించరని, వారి ఇష్టానుసారంగా వాహనాలను రోడ్లపైకి తీసుకువస్తుండడంతో భారీ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయని, వారికి సూచిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసు అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నరకంలో చిక్కుకోకుండా ఉండేందుకు వర్షం తగ్గిపోయే వరకు ఇంట్లోనే ఉండాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.