హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నదికి భారీగా వరద ఉధృత పెరిగింది… దీంతో మూసీ నది హైదరాబాద్ ప్రజలను టెన్షన్ పెడుతూ ఉంది.
భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతూ ఉండడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వంతెనకు రెండు వైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట-మలక్‌పేట మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మూసీ ఉగ్రరూపం దాల్చడంతో మూసానగర్, కమలానగర్‌ను వరద చుట్టిముట్టింది. మూసారాంబాగ్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీచేయించారు. రత్నానగర్, పటేల్‌నగర్ గోల్నాకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించారు. వరదల కారణంగా చాదర్‌ఘాట్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు…రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో ముందస్తుగా ఎనిమిది గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 5733.36 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 17,809.25 క్యూసెక్కుల నీరు బయటకు పంపుతూ ఉన్నారు. మూసీ పూర్తిస్థాయిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 637.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 4.46 టీఎంసీలు. ఇప్పుడు 2.67 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...
Prev Post
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు…
Next Post