హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్…

*🔹హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన _తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్._*

_• మరికొద్ది సేపట్లో ఏపీ సీఎస్ తో భేటీ._

అనంతరం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ కానున్న సోమేష్ కుమార్._*

తెలంగాణ మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ విజయవాడకు బయలుదేరారు. హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్‌లో విజయవాడకు వెళ్లారు. ఉదయం 10:15 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో భేటీ కానున్నారు. సీఎస్ కు జాయినింగ్ రిపోర్ట్ చేయనున్నారు. అనంతరం 11 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నారు సోమేష్. కాగా, ఈ ఏడాది డిసెంబర్ వరకు సోమేష్ కుమార్ పదవీకాలం ఉండగా.. మిగిలిన పదవీ కాలాన్ని ఏపీలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయనకు ఏ పోస్టింగ్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎస్‌గా పని చేసిన ఆయనకు, ఏపీలో ఎలాంటి పోస్ట్ ఇస్తారా? అనేది చర్చనీయాంశమైంది.