ఇవాళ హైదరాబాద్ కు 3 రాష్ట్రాల సీఎంలు..!!

ఈరోజు హైద‌రాబాద్‌కు కేర‌ళ‌, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హైద‌రాబాద్‌ రానున్నారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌మాన్ ఖ‌మ్మంలో జ‌న‌వ‌రి 18న జ‌ర‌గ‌నున్న బీఆర్‌ఎస్ భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొంటారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ కూడా నేడు హైద‌రాబాద్ చేరుకోనున్నారు. వీళ్లంతా సీఎం కేసీఆర్‌తో క‌లిసి రేపు ఉద‌యం ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రికి వెళ్తారు. స్వామివారిని ద‌ర్శించుకున్న త‌ర్వాత అంద‌రూ ఖ‌మ్మం స‌భ‌కు బ‌య‌లుదేర‌తారు.
ఖ‌మ్మంలో తొలిసారి నిర్వ‌హిస్తున్న బీఆర్ఎస్ స‌భ‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. క‌నివినీ ఎరుగ‌ని రీతిలో స‌భ‌ను నిర్వ‌హించనున్నారు. మంత్రి హ‌రీశ్ రావు, ర‌వాణా శాఖ‌మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ ఇప్ప‌టికే బ‌హిరంగ స‌భా స్థ‌లిలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. బీఆర్ఎస్‌ ముఖ్య‌నేత‌లంతా ఈరోజు హైద‌రాబాద్ చేరుకోనున్నారు. దాంతో, 400 ఎక‌రాల్లో వాహ‌నాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాదు స‌భ‌లో వెయ్యు మంది వాలంటీర్లను నియామించారు.