హైదరాబాద్‌లో సాయంత్రం 5.30 నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు..!!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నేడు ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్‌ వరకు ట్రాఫిక్‌ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు…సాయంత్రం 5.30 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య జూబ్లీహిల్స్‌ నుంచి బయల్దేరుతారు. దీంతో జూబ్లీ చెక్‌పోస్ట్‌, సాగర్‌ సొసైటీ, తాజ్‌ కృష్ణ, నిరంకారి జంక్షన్‌ నుంచి రవీంద్రభారతి వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు, నిలిపివేత ఉంటాయని తెలిపారు. అందువల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.