ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై పలు అనుమానాలు….

భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం కుప్పకూలింది. కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది….

భారత వైమానిక చర్రితలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ఉన్నతాధికారి, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోవడంపై ఆర్మీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ఉన్నట్టు భారతీయ వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి….

డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ఇంటికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. ఆయన వెంట కొంతమంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. బిపిన్ రావత్ మరణం గురించి జరుగుతున్న ప్రచారంపై రాజ్‌నాథ్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. బిపిన్ రావత్ ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలవ్వగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ మరణించారా? లేదా గాయపడ్డారా అనే విషయంపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు…