నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ICAR‌)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ….

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ICAR‌)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూన్‌ 1 వరకు అందుబాటులో ఉంటాయి. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 462 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాలు ఉన్నవి…. 462..

ఇందులో అసిస్టెంట్‌-ఐకార్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ 391 (జనరల్‌ 235, ఓబీసీ 79, ఈడబ్ల్యూఎస్‌ 23, ఎస్సీ 41, ఎస్టీ 13, పీడబ్ల్యూడీ 5), అసిస్టెంట్‌-హెడ్‌క్వార్టర్‌ 71 (జనరల్‌ 44, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్‌ 3, ఎస్సీ 7, ఎస్టీ 1, పీడబ్ల్యూడీ 3) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: మే 7
దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 1
వెబ్‌సైట్‌: www.iari.res.in.