సీనియ‌ర్ సిటిజ‌న్లకు గుడ్ న్యూస్.. అధిరిపోయే ఆఫర్ ప్రకటించిన ఐసీఐసీఐ..

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ ట‌ర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఓ పథకాన్ని ప్రారంభించింది. అధిక వ‌డ్డీరేటును అందించే ఈ ప్ర‌త్యేక‌మైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కాన్ని మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు అమ‌లులో ఉంటాయి.

దీర్ఘ కాలిక స్థిర‌త్వమే ప్రధానంగా ఉండే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఐడియ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప‌ర్చునిటీ కానుంది. వీరికి అద‌న‌పు బెనిఫిట్లు కూడా ఉంటాయి. ఈ ప‌థ‌కం కింద డిపాజిట్ చేసేవారికి ఐసీఐసీఐ అందించే వ‌డ్డీరేట్లు వేరుగా అందిస్తోంది. అవేంటో ఓ సారి ఇక్కడ చూద్దాం…

ఐసీఐసీఐ బ్యాంకులో 6.30 శాతం వ‌డ్డీ

సీనియ‌ర్ సిటిజ‌న్లు డిపాజిట్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై అధికంగా ఐసీఐసీఐ బ్యాంకు 80 బేసిక్ పాయింట్ల వ‌డ్డీరేట్లు క‌ల్పిస్తున్న‌ది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేకంగా రూపొందించిన ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయ‌ర్స్ ఎఫ్‌డీ స్కీమ్ కింద డిపాజిట్ చేసే వారికి 6.30 శాతం వ‌డ్డీరేటు అందిస్తున్న‌ది. ఇక ఈ స్కీమ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సాధారణ ప్రజలతో పోలిస్తే..

గతంలో వృద్ధులకు ఆఫర్ చేసిన వడ్డీ కన్నా ఇది 30 బేసిస్ పాయింట్స్ ఎక్కువ. సాధారణ ప్రజలతో పోలిస్తే 80 బేసిస్ పాయింట్స్ ఎక్కువ. ఇందు‌లో 5 నుంచి 10 ఏళ్ల రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు. పాత ఫిక్స్‌డ్ డిపాజిట్లను రెన్యువల్ చేసేవాళ్లు కూడా ఈ స్కీమ్‌లోకి మారొచ్చు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 90శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.

క్రెడిట్ కార్డ్ సౌకర్యం…

ఈ స్కీమ్‌లో చేరిన వారికి క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తుంది ఐసీఐసీఐ బ్యాంకు. ఆసక్తి గల కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ‘ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ’ పథకంలో చేరొచ్చు. ఇలా కాకుంటే మీకు సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో సంప్రదించి మరిన్ని వివరాలకు తెలుసుకోవచ్చు.