ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే వేలాది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. అప్రకటిత యుద్ధ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ నిర్వహిస్తున్నది. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా కేంద్రం ఆరో విడతలో 143 మంది ప్రయాణికులను తరలించింది. ఇందులో ఇద్దరు నేపాల్ పౌరులు ఉన్నారు. విమానంలో ఢిల్లీకి చేరిన ప్రయాణికులకు కేంద్ర సహాయశాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. విమానం సురక్షితంగా రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ప్రయాణికులకు స్వాగతం పలికే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
భారత్‌కు తిరిగి రావాలనుకునే ప్రతి పౌరుడిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అక్టోబర్ 7 ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ భీకరంగా దాడి చేసిన విసయం తెలిసిందే. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్రం ఈ నెల 12న ‘ఆపరేషన్ అజయ్’ని ప్రారంభించింది. ఇంతకు ముందు ఐదు ప్రత్యేక విమానాలు టెల్ అవీవ్ నుంచి ఢిల్లీకి పిల్లలతో సహా 1200 మందిని తరలించింది. ఇందులో 18 మంది వరకు నేపాలీ పౌరులు సైతం ఉన్నారు. ఇజ్రాయెల్‌లో భారతీయ పౌరులు దాదాపు 18వేల మంది వరకు ఉన్నారు.
పలువురు విద్యార్థులు చదువుకుంటుండగా మరికొందరు ఐటీ నిపుణులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు. అయితే, ఎక్కువగా కేర్ టేకర్లుగా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హమాస్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో జనం బిక్కుబిక్కుమంటు జీవిస్తున్నారు. హమాస్ రాకెట్లతో భారీ దాడులు జరిపిన తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతికార దాడులకు దిగింది. దీంతో పిల్లలతో సహా 4,400 మంది పాలస్తీనియన్లు మరణించారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో 1400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు..