ఐఎమ్ఈఐ నెంబర్‌ల‌ను మార్చి తిరిగి కొత్త సెల్ ఫోన్‌లుగా మార్చి అమ్మకాలు..

రాచకొండ :

సెల్ ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను మారుస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది.

మూడు రాష్ట్రాల్లో చోరీ చేసిన దాదాపు 563 స్మార్ట్ ఫోన్‌లను తీసుకువచ్చి నగరంలో ఐఎమ్ఈఐ నెంబర్‌ల‌ను మార్చి తిరిగి కొత్త సెల్ ఫోన్‌లుగా మార్చి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గ్రేటర్ హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు…ప్రాథమిక విచారణలో దొరికిన 563 మొబైల్ ఫోన్‌లను కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో కొట్టేసి నగరానికి తీసుకు వచ్చినట్లు పోలీసు‌లు గుర్తించారు..ప్రస్తుతం హైదరాబాద్‌లో మొబైల్ ఫోన్‌ల ఐఎమ్ఈఐ నెంబర్ లు మార్చే స్థావారం కోసం గాలిస్తునారు. దొరికిన ఫోన్‌ల విలువ దాదాపు రూ.2.50 కోట్ల పైన ఉంటుందని సమాచారం. ఇదే ముఠా తిరిగి వెళ్ళే సమయంలో ఇక్కడ ఫోన్‌లు కొట్టేసి ముంబై, ఢిల్లీ రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ ముఠా అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ ముఠా సభ్యుల సంఖ్య 50కి పై గా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.