టీమిండియా ఓటమిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి…!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఆసీస్‌లో అడుగుపెట్టిన రోహిత్‌ సేన సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు‌.. టీమ్‌ఇండియాకు బ్యాటింగ్‌ అప్పగించింది. ఓపెనర్లు మరోసారి విఫలమవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 170 పరుగులు చేసింది…దీంతో పదిహేనేండ్ల క్రితం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియా.. మరోమారు కప్పు సాధించాలని కోరుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. భారత్‌ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి. అభిమానులు తమ బాధను ఇలా మీమ్స్‌ రూపంలో చూపిస్తున్నారు…