ఆఫ్గాన్ పై భారత్ ఘన విజయం..35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిన భారత్..

వరల్డ్ కప్లో భాగంగా ఇవ్వాల (బుధవారం) భారత్, ఆఫ్గాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన 9వ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది..
273 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ 84 బంతుల్లో (131) పరుగులు చేసి అవుటయ్యాడు.
ఆ తర్వాత ఇషాన్ కిషన్ (47) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అప్పటికే పటిష్టమైన స్థితిలో భారత్ ఉంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 55, శ్రేయస్ అయ్యర్ 25 కలిసి ఇన్నింగ్స్ను ముగించారు. నాటౌట్గా నిలిచారు. టీమిండియా 8 వికెట్ల ఘన విజయం సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. ఈ క్రమంలో ఆఫ్గాన్ బౌలర్ రశీద్ ఖాన్ రోహిత్, ఇషాన్ వికెట్లను పడగొట్టడం గమనార్హం.