ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం…

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది.

డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా..
జోష్ ఇంగ్లీస్(45),
స్టీవ్ స్మిత్(41),
మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్ల‌కు తోడుగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు..
భారత బ్యాటర్‌లు తలో హాఫ్ సెంచరీలు సాధించారు. గిల్ 74 పరుగులతో అత్యుత్తమ స్కోరు చేయగా, గైక్వాడ్ వన్డేల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి 77 బంతుల్లో 71 పరుగులతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు…

లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు
రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71),
శుభ్‌మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74)తో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్),
సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు…
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.., పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది…