నాలుగో రోజు ఆట పూర్తి.. భారత్ మరో 280 పరుగులు చేస్తేనే..

WTC Final 2023 : నాలుగో రోజు ఆట పూర్తి.. భారత్ మరో 280 పరుగులు చేస్తేనే..

WTC FINAL 2023 : డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట పూర్తయింది. ఆసీస్‌(aus) నిర్దేశించిన 444 లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌(india).. ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులతో నిలిచింది. భారత్‌ విజయం సాధించాలంటే ఆఖరి రోజు 280 పరుగులు చేయాలి…

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ 57 బంతుల్లో 41 పరుగులు చేసి షమి బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ 84 ఓవర్లలో 269 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 442 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలెక్స్ కారీ 66, కమిన్స్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు…అంతకు ముందు తొలి సెషన్‌ ప్రారంభంలోనే ఆసీస్‌కు షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో 5వ వికెట్ కోల్పోయింది. 46.4 ఓవర్ వద్ద భారత (India) బౌలర్ ఉమేశ్ వేసిన బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ ఔటయ్యాడు. దీంతో వికెట్లు పడనివ్వకుండా ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు నిలకడగా ఆడుతున్న క్రమంలో 62.6 ఓవర్ వద్ద ఆసీస్ 167 పరుగులు చేసి 6వ వికెట్ కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ 95 బంతుల్లో 25 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు…