మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం..

రో-కో ఇద్దరు ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడి..

ఆస్ట్రేలియా తో చివరి వన్డే లో భారత్ విజయంతో ముగించింది. సిడ్నీ వేదికగా శనివారం జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (121), విరాట్ కోహ్లీ (74) చెలరేగడంతో 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్వుడ్ 1 వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.3 ఓవర్లకు 236 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ రెన్షా (56 పరుగులు) ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. హర్షిత్ రానా 4 వికెట్లతో సత్తా చాటాడు. టీమ్ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, అక్షర్ పటేల్, కుల్దీప్ యదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో 1 వికెట్ దక్కించుకున్నారు..

రో-కో ఇద్దరు ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. రోహిత్ శ‌ర్మ 63 బంతుల్లో, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాల‌ను అందుకున్నారు. హాఫ్ సెంచ‌రీ త‌రువాత మ‌రింత దూకుడును పెంచిన రోహిత్ శ‌ర్మ 105 బంతుల్లో శ‌త‌కాన్ని అందుకున్నాడు. వ‌న్డేల్లో హిట్‌మ్యాన్‌కు ఇది 33వ శ‌త‌కం కాగా.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఆ త‌రువాత కూడా ఈ జంట ఆసీస్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చింది.