అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా అద్భుతమైన పోరాటం…తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు…

అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా అద్భుతమైన పోరాటం నమోదు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేయగా…

నాల్గ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. గిల్, కోహ్లీ, అక్ష‌ర్ పేటేల్ అద్భుతంగా రాణించారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, చ‌టేశ్వ‌ర పుజారా, శ్రీక‌ర్ భ‌ర‌త్ త‌దిత‌రులు ప‌ర్వాలేద‌నిపించారు. వీరంద‌రూ ఆసీస్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధంగా ఎదుర్కొని భారీ స్కోర్ చేశారు. విరాట్ కోహ్లీ 186 ప‌రుగులు చేశాడు. భార‌త ఆట‌గాడు శ్రేయాస్ అయ్య‌ర్ గాయం కార‌ణంగా బ్యాటింగ్ చేయ‌డానికి దిగ‌లేదు. దీంతో కోహ్లీ ఔట‌వ్వ‌గా భార‌త్ ఆలౌట్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. మొత్తంగా భార‌త జ‌ట్టు 571 ప‌రుగులు చేసింది. ఆసీస్ జ‌ట్టుపై 91 ప‌రుగుల ఆధిక్యంలో నిలిచింది. నాల్గ‌వ టెస్టు ముగియ‌డానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. చివ‌రి రోజున ఆసీస్ త‌క్కువ ప‌రుగుల‌కు ఆలౌట్ చేసి..ఆ ల‌క్ష్యాన్ని భార‌త్ చేరుకోగ‌లిగితే భార‌త జ‌ట్టుకు విజ‌యావ‌కాశాలుంటాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే మ్యాచ్ డ్రా అయ్యే అవ‌కాశాలే ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.

విరాట్ కోహ్లీ వీర విహారం

తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ వీర‌విహారం చేశాడు. 186 ప‌రుగులు చేశాడు. సెంచ‌రీ పూర్త‌యిన త‌ర్వాత కాస్త జోరు పెంచాడు. సెంచ‌రీ చేసే సంద‌ర్భంగా కేవ‌లం 5 ఫోర్లు మాత్ర‌మే కొట్టిన కోహ్లీ, ఆ త‌ర్వాత గేరు మార్చాడు. మ‌రో 10 ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 15 ఫోర్లు కొట్టి 186 ప‌రుగులు చేశాడు. డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయ్యాడు.

అక్ష‌ర్ ప‌టేల్ 79 ప‌రుగులు

ఇటీవ‌ల కాలంలో అక్ష‌ర్ ప‌టేల్ అద‌ర‌గొడుతున్నాడు. అహ్మ‌దాబాద్ స్టేడియంలో మ‌రోసారి త‌న సత్తా చాటాడు. 79 ప‌రుగులు చేశాడు. మంద‌కోడిగా సాగుతున్న ఆట‌లో జోష్ నింపాడు. 5 ఫోర్లు 4 సిక్సులు బాదాడు. స్కోర్ బోర్డును కాసేపు ప‌రుగులు పెట్టించాడు. జ‌ట్టు స్కోర్ పెంచాడు. సెంచ‌రీకి చేరువ అవుతున్నాడ‌ని అభిమానులు సంబ‌ర‌ప‌డేలోగా ఔట్ అయ్యాడు.అందుకులుగా భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు చేసింది. తద్వారా 91 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది.

టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే విరాట్ కోహ్లీ సెంచరీయే. అయితే కోహ్లీ 186 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. కోహ్లీ 9వ వికెట్ రూపంలో వెనుదిరగ్గా, శ్రేయాస్ అయ్యర్ (అబ్సెంట్ హర్ట్) బ్యాటింగ్ కు దిగకపోవడంతో టీమిండియా ఆలౌట్ అయినట్టు ప్రకటించారు.

నేటి ఆటలో చెప్పుకోదగ్గ మరో ఇన్నింగ్స్ అక్షర్ పటేల్ నుంచి వచ్చింది. కోహ్లీతో కలిసి అక్షర్ పటేల్ నమోదు చేసిన కీలక భాగస్వామ్యమే ఈ మ్యాచ్ లో భారత్ పైచేయి సాధించేందుకు ఉపయోగపడింది. అక్షర్ పటేల్ 113 బంతులాడి 5 ఫోర్లు, 4 సిక్సులతో 79 పరుగులు చేశాడు. చివర్లో అశ్విన్ 7, ఉమేశ్ సున్నా పరుగులకు అవుటయ్యారు. షమీ (0) నాటౌట్ గా మిగిలాడు.

ఆసీస్ బౌలర్లలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్ 3, యువ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 1, లెఫ్మార్మ్ స్పిన్నర్ కుహ్నెమన్ 1 వికెట్ తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 6 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ ఎంతో ముందుజాగ్రత్తతో తమ స్పిన్నర్ కుహ్నెమన్ ను ఓపెనర్ గా బరిలో దింపింది. ప్రస్తుతం క్రీజులో కుహ్నెమన్ (0 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (3 బ్యాటింగ్) ఉన్నారు.

కాగా, ఇవాళ్టి ఆటలో బ్యాటింగ్ కు దిగని శ్రేయాస్ అయ్యర్ నడుం నొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది. అయ్యర్ ను స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు.