భుజానికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి భారత్, ఆసిస్ ఆటగాళ్లు..

భారత్(india) – ఆస్ట్రేలియా(Australia) మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్, ఆసిస్ ఆటగాళ్లు జాతీయ గీతాలాపన సందర్భంగా భుజానికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలో అడుగు పెట్టారు.
ఇటీవల ఒడిశాలో ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ (train accident)తెలిసిందే. ఈ ఘటనలో 270 మందికి పైగా మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో వారి మృతికి సంతాప సూచకంగా ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలో అడుగు పెట్టారు. మొదట కాసేపు మౌనం పాటించి నివాళులు అర్పించారు.