సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రక్తత…

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద తీవ్ర ఉద్రక్తత నెలకొంది…

హైదరాబాద్ లో జరగనున్న భారత్‌ – ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ హంగామాతో నగరంలోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. వీరిలో ఓ మహిళకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించి జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల విక్రయిస్తున్నారు. టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు వేలల్లో తరలి వచ్చారు. దీంతో అక్కడ ఎక్కువ మంది గుమిగూడారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.