భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. భారత్‌- ఆస్ట్రేలియా(ind vs aus) ఆడబోయే ఈ మ్యాచ్‌కి ఇంగ్లాండ్‌లోని ఓవల్ గ్రౌండ్‌ ఆతిథ్యమివ్వనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ ఛాంపియన్స్ షిప్ టైటిల్ మినహాయించి అన్ని ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి. టీమిండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ కు చేరింది. ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. రన్‌ మెషిన్‌ చెలరిగితే ఆసీస్‌ తట్టుకోవడం కష్టమే. ఇప్పటిదాకా ఆసీస్‌పై ఉన్న గణాంకాలే ఆ నిజాన్ని చెబుతున్నాయి. మరోవైపు కోహ్లీ ముందు కొన్ని రికార్డ్‌లు ఊరిస్తున్నాయి. ఆసీస్‌పై టెస్టుల్లో 1,979 పరుగులు చేసిన కోహ్లీ మరో 21 రన్స్ చేస్తే రెండువేల పరుగుల మైలురాయి చేరుకుంటాడు. కొంతకాలంగా ఐసీసీ ట్రోఫీల కరువును ఎదుర్కొంటున్న టీమిండియా.. ఈ టైటిల్‌ గెలిచి అభిమానుల్ని అలరించాలని పట్టుదలగా ఉంది.

ఓవల్ వేదికగా జరుగుతున్న WTC Final 2023లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా.. ట్రావిస్ హెడ్ 106 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ చేయగా.. స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగుతున్నాడు. ట్రావిస్ హెడ్‌కి ఇది ఆరో టెస్టు సెంచరీ కాగా విదేశాల్లో మొట్టమొదటిది. టీమిండియాపై కూడా ట్రావిస్ హెడ్‌కి ఇదే మొదటి సెంచరీ. 65 ఓవర్లు ముగిసే సమయానికి ఈ ఇద్దరూ 249 బంతుల్లో 162 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ (146), స్మిత్ (95) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి ఆసీస్ 327 రన్స్ చేసింది…

మొదటి రోజు ఆసీస్ దే పై చేయి…

డబ్ల్యూటీసీ ఫైనల్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. హెడ్ (146), స్మిత్ (95) రన్స్ తో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ, సిరాజ్, శార్దూల్ తలా ఒక వికెట్ తీశారు.