భారత‌ స్పిన్నర్ల జోరు…ఇంగ్లాండ్‌ 112 పరుగులకే కుప్పకూలింది….

భారత్‌- ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ టెస్టులో భారత బౌలర్లు చెలరేగిపోయారు. కొత్త స్టేడియంలో పింక్‌ బాల్‌తో స్పిన్నర్లు ఆద్భుతంగా ఆకట్టుకున్నారు.
యాభై ఓవర్లు కూడా ఆడలేక కుప్పకూలిపోయింది. 48.4 ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు 112 పరుగులకు ఆలౌటయ్యారు

మూడో టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన ఇంగ్లాండ్‌ జట్టులో జాక్‌ క్రాలే(53) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అతనొక్కడే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. క్రాలేతో కలిసి జో రూట్‌(17) కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా అశ్విన్‌ వెనక్కి పంపాడు. తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్‌ 81/4తో ఇబ్బందుల్లో పడింది. టీ విరామం తర్వాత స్పిన్నర్లు మరింత రెచ్చిపోయారు. డొమినిక్‌ సిబ్లే(0), జానీ బెయిర్‌స్టో(0), బెన్‌స్టోక్స్‌(6), ఓలీ పోప్‌(1), జాక్‌ లీచ్‌(), స్టువర్ట్‌ బ్రాడ్‌(3), జేమ్స్‌ ఆండర్సన్‌(0 నాటౌట్‌) సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరారు. బెన్‌ ఫోక్స్‌(12), జోఫ్రా ఆర్చర్‌(11) రెండంకెల స్కోరు చేశారు..