ఇంగ్లండ్‌తో చివరి టెస్టు మ్యాచ్‌ లో భారత్‌ 255 పరుగుల ఆధిక్యం..

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్….

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌ రెండు రోజు భారత బ్యాటర్లు రాణించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీలతో రాణించారు. దాంతో.. స్కోరు బోర్డు పరుగులు తీసింది. భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. తద్వారా 255 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కుప్పకూలిన విషయం తెలిసిందే. 218 పరుగులు మాత్రమే చేసి పది వికెట్లు కోల్పోయారు..

ఇంగ్లాండ్ 218 ఆలౌట్….

ఇండియా 473/8….

సెంచరీలతో చెలరేగిన రోహిత్ శర్మ (103),సుమన్ గిల్ (110)…

జైస్వాల్ (57),పడిక్కల్, (65)సర్పరాజ్ ఖాన్ (53) అర్థ సెంచరీలు…

క్రీజ్ లో కుల్దీప్ యాదవ్ (27), భూమ్రా (19)….

ఇంగ్లండ్‌ బౌలింగ్ చూస్తే.. షోయబ్‌ బషీర్ ఒక్కడే నాలుగు వికెట్లను తీసుకున్నాడు. ఆ తర్వాత హార్ట్‌లీ రెండు వికెట్లు పడగొట్టగా.. జేమ్స్ అండర్సన్, బెన్‌ స్టోక్స్‌ చెరో వికెట్ తీశారు. ఇంగ్లంగ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొందరగా ఆలౌట్‌ అయ్యింది. దాంతో.. ఇండియాకు ఆధిక్యం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను ఇండియా 3-1తో కైవసం చేసుకుంది. చివరి టెస్టును గెలుపుతో అయినా ముగించాలని ఇంగ్లండ్‌ భావించినా వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. భారత్‌ మంచి ఆధిక్యం సాధించడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడినట్లు అయ్యింది..