ఇంగ్లాండ్‌ 81 ఆలౌట్‌…………….భారత్‌ టార్గెట్‌ 49…

భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లాండ్‌ విలవిల్లాడింది. అక్షర్‌ పటేల్‌(5/32), రవిచంద్రన్‌ అశ్విన్‌(4/48) ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించారు. బ్యాట్స్‌మెన్‌ అంతా గింగిర్లు తిరిగే బంతులను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్లలో జో రూట్‌(19), బెన్‌స్టోక్స్‌(25), ఓలీ పోప్‌(12) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న జాక్‌ క్రాలే(0), డొమినిక్‌ సిబ్లే(7), జానీ బెయిర్‌స్టో(0), బెన్‌ ఫోక్స్‌(8) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు….

3 వికెట్ల న‌ష్టానికి 99 ప‌రుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్ త్వ‌ర‌గా వికెట్ల‌ను కోల్పోయింది. తొలుత అజింక్యా రెహానే (7) వెనుదిరిగాడు. ఆ త‌ర‌వాత‌… రోహిత్ శ‌ర్మ (66) వంతు వ‌చ్చింది. పంత్ (1), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (0), అక్ష‌ర్ ప‌టేల్ (0) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల‌వ‌లేక‌పోయారు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (17) ఒక్క‌డే కాసేపు భార‌త ప‌త‌నాన్ని నిలువ‌రించ‌గ‌లిగాడు. బుమ్రాని రూట్ అవుట్ చేయ‌డంతో.. భార‌త ఇన్నింగ్స్‌కి తెర‌ప‌డింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జాక్ రీచ్‌కి నాలుగు వికెట్లు ద‌క్కాయి, పార్ట్ టైమ్ బౌల‌ర్ రూట్ 5 వికెట్లు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం…