ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం…

రాజ్‌కోట్‌ టెస్ట్: భారత్‌ 430/4 డిక్లేర్డ్‌..

ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 557 పరుగులు..

రెండో ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో రాణించిన యశస్వి జైస్వాల్(214).. హాఫ్‌ సెంచరీలు చేసిన గిల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌

ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్.. అతి చిన్న వయసులో 2 డబుల్‌ సెంచరీలతో జైస్వాల్‌ రికార్డ్.. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జైస్వాల్.. 12 సిక్సర్లు కొట్టి వసీం అక్రమ్‌ రికార్డ్‌ సమం చేసిన జైస్వాల్..

రాజ్‌కోట్‌ టెస్ట్‌: ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం. ఇంగ్లాండ్‌పై 435 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు…

ఇంగ్లండ్‌పై టీమిండియా 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. దీంతో 430 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది. టెస్టు చరిత్రలో పరుగుల పరంగా టీమిండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. అజేయంగా 214 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. అతను 131 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 112 పరుగులు చేశాడు. ఈ విజయంతో సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజ వేసింది. ఇప్పుడు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది..