ఇంగ్లీషోళ్లకే మైండ్ బ్లాంక్ చేసిన పడిక్కల్..

రజత్ పాటిదార్‌కు బదులుగా టీమ్‌ఇండియా(Team India)లో ఆడే అవకాశం దక్కించుకున్న మరో యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్(Devdutt Padikkal)..ధర్మశాల టెస్టు రెండో రోజు తొలి అర్ధ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. కేవలం 83 బంతుల్లోనే అర్ధ సెంచరీకి చేరుకున్న పడిక్కల్ 8 అద్భుతమైన ఫోర్లు, ఒక సిక్సర్ కూడా బాదాడు. సర్ఫరాజ్ ఖాన్‌(Sarfaraz Khan) తో కలిసి పడిక్కల్ కూడా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సెంచరీలతో చెలరేగిన రోహిత్, గిల్ ల వికెట్లను వరుసగా కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ లు తలా హాఫ్ సెంచరీలతో భారత జట్టును మళ్లీ గాడిలో పెట్టేందుకు సహకరించారు. చివరగా, రెండో రోజు ఆటలో మూడో సెషన్‌లో షోయబ్ బషీర్ బాదిన పడిక్కల్ తన ఇన్నింగ్స్‌లో 103 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 65 పరుగులు చేశాడు…నిజానికి, ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత రజత్ పాటిదార్‌ను జట్టులోకి తీసుకున్నారు. రజత్‌కు కూడా వరుసగా 3 మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి లభించింది. కానీ 3 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో రజత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. దీని కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో పాటిదార్‌ని తొలగించారు. దీంతో దేవదత్ పడిక్కల్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేరాడు. అవకాశం దొరికిన వెంటనే హాఫ్ సెంచరీలు సాధించి కోట్లాది మంది అభిమానులకు, కెప్టెన్‌కు పడిక్కల్ ఈ స్థానానికి నిజమైన అర్హుడిగా నిరూపించుకున్నాడు…భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 5వ, చివరి మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది. ఆపై టీమ్ ఇండియా వరుసగా 3 మ్యాచ్‌లను గెలుచుకుని అద్భుతంగా పునరాగమనం చేసింది. ఇప్పుడు భారత జట్టు మరో విజయం దిశగా దూసుకుపోతోంది. ధర్మశాల టెస్టులోనూ భారత్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.