టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా….

టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసినా.. మలి టెస్టులో ఏకంగా 372 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సత్తా చాటింది. ఈ క్రమంలో భారత జట్టు ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది..
న్యూజిలాండ్‌ కు మాత్రం ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది…

రెండో టెస్టులో ఏకంగా 372 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు.. కేవలం 165 పరుగులకే ఆలౌట్ కావడంతో.. టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో…1-0 తేడాతో టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా.కాగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ కాగా… రెండో ఇన్నింగ్స్ లో 276 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు… 167 పరుగులకు చాప చుట్టేసింది. దీంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది…

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ జట్టు 121 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్‌-5లో ఉన్నాయి….ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2021-23) పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడు విజయాలు, రెండు డ్రాలు, ఓ ఓటమితో 42 పాయింట్లు సాధించి టాప్‌లో ఉన్నా.. విజయాల శాతం ఆధారంగా 58.33 పర్సంటేజీతో మూడో స్థానంలో నిలిచింది. శ్రీలంక 100 శాతం పర్సంటేజీతో అగ్రస్థానంలో ఉండగా… పాకిస్థాన్ 66.66 శాతం విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇంకా పాయింట్ల ఖాతాను ఓపెన్ చేయలేదు…