కీలకమైన రెండో వన్డే మ్యాచ్ వర్షార్పణం ..

కీలకమైన రెండో వన్డే మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. 29 ఓవర్లకు కుదించిన తర్వాత టీమిండియా 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. ఇక ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా 1-0లో ఆధిక్యంలో న్యూజిలాండ్ కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్ నవంబర్ 30న జరగనుంది. చివరి వన్డే మ్యాచ్‎లో ఒక వేళ న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇండియా గెలిస్తే సిరీస్ టైగా ముగుస్తుంది. ఇక మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. శుభ్‎మన్ గిల్ 42 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‎తో 45 రన్స్ చేయగా. సూర్యకుమార్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేశారు.