న్యూజిలాండ్ పై భారత్ ప్రతీకార విజయం..

*ఫైనల్ కి దూసుకెళ్లిన భారత్*

కింగ్‌ కోహ్లీ వాంఖడేలో నెలకొల్పిన 50వ శతకంతో మరికొన్ని రికార్డులనూ తుడిచేశాడు. సుదీర్ఘకాలంగా అటకెక్కిన చరిత్ర పుస్తకాల దుమ్మును దులిపేస్తూ వాంఖడేలో కొత్త చరిత్ర లిఖించాడు…వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్‌.. వన్డేలలో నెలకొల్పిన 49 శతకాల రికార్డుతో పాటు ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డునూ బ్రేక్‌ చేశాడు.

విశ్వ‌విజేత‌గా నిలిచేందుకు భార‌త్‌కు ఇంకొక్క విజ‌యం చాలు. 12 ఏళ్ల క‌ల‌ను తీర్చుకునేందుకు టీమ్ఇండియా ఎదుట సువ‌ర్ణావ‌కాశం. సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను మ‌ట్టిక‌రిపించిన భార‌త్ ద‌ర్జాగా ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం (న‌వంబ‌ర్ 19)న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టుతో ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ ఒక్క మ్యాచులో గెలిస్తే చాలు ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా భార‌త్ నిల‌వ‌నుంది.

*వరల్డ్ కప్ 2023లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్.. సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇండియా 70 రన్స్ తేడాతో విజయం సాధించింది..
*వరల్డ్ కప్ లో ఫైనల్స్ కి చేరిన భారత్*

ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ని ఆల్ ఔట్ చేసింది …70 పరుగుల తేడాతో గెలిచింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది…

ముంబై స్టేడియంలో జరిగిన సెమిస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై చెలరేగిన టీం ఇండియా బ్యాట్స్‌మెన్ లు సెంచరీలతో చెలరేగారు…

విరాట్ 117(113) ఈ సెంచరీతో వండేల్లో సచిన్ రికార్డు బ్రేక్ చేసి 50 సెంచరీలు పూర్తి చేశారు..

శ్రేయస్ 105(70)

రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడిన శుభమన్‌ గిల్‌ చివరి ఓవర్లో వచ్చి 80* (66) పరుగులు చేశారు…

కేఎల్ రాహుల్ 39* (20),

రోహిత్ శర్మ 47 (29),

సూర్యకుమార్ 1 (2) పరుగులు చేశారు.

ఇక 398 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లు వరుస విజయాలుతో సెమీస్ కి చేరిన టీం ఇండియా బౌలర్లకు పెద్దపరీక్షే పెట్టారు..

చిన్న చిన్న అవకాశాలు చేజార్చుకున్న టీం ఇండియా ఫీల్డర్లు మొత్తానికి గెలుపు సొంతం చేసుకున్నారు…

ఇండియన్ బౌలర్లలో అత్యధికంగా షమీ 7 వికెట్లు తీసి భారత్ గెలుపు అందించారు..

398 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవ‌ర్ల‌లో 327 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 70 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ గెలుపుతో 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లైంది. కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (134; 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. కేన్ విలియ‌మ్స‌న్ (69; 73 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాప్ సెంచ‌రీ చేశాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో కివీస్ ఓట‌మి త‌ప్ప‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ ఏడు వికెట్లు తీశాడు. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు…

కాగా, ఫైనల్ మ్యాచ్ ఈ ఆదివారం (19th) అహ్మదాబాద్ లో జరగనున్నది…

ఇక టీం ఇండియా ప్రత్యర్ధి టీం ఎవరో రేపు జరగనున్న ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా సెకండ్ సెమీస్ మ్యాచ్ తో తేలనున్నది…