శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 రన్స్..

శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 రన్స్ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ. శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 349 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌కు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.చివర్లో లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన గిల్ ద్విశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడే ప్రయత్నంలో షిప్లే బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గిల్ డబుల్ సెంచరీ సాయంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది.

కెప్టెన్ రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్ 2, షిప్లే 2, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నెర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు.