భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్… 24.1వ ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 147/2..

ఆసియా క‌ప్ 2023 సూప‌ర్‌-4లో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌కు శ్రీలంక‌లోని ప్రేమ‌దాస స్టేడియం వేదికైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది…వ‌ర్షం ఆగిపోయింది.

మైదాన సిబ్బంది క‌వ‌ర్ల‌ను తొల‌గిస్తున్నారు. 6.22 pm త‌రువాత నుంచి ఓవ‌ర్ల కుదింపు ఉండే అవ‌కాశం ఉంది. అంపైర్లు మైదానాన్ని ప‌రిశీలించిన త‌రువాత మ్యాచ్‌ను ఎప్పుడు మొద‌లు పెట్ట‌నున్నారు అనే విష‌యం తెలియ‌నుంది.అనుకున్న‌ట్లుగానే వ‌రుణుడు వ‌చ్చేశాడు. 24.1 ఓవ‌ర్ల ఆట పూర్తి అయిన త‌రువాత వ‌ర్షం మొద‌లైంది. ఆట‌గాళ్లు మైదానాన్ని వీడారు. గ్రౌండ్ సిబ్బంది మైదానం మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. 24.1వ ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 147/2. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లి (8) లు క్రీజులో ఉన్నారు..భార‌త జ‌ట్టుకు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు షాకులు త‌గిలాయి. దూకుడుగా ఆడుతున్న ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్ మ‌న్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) ఔటైయ్యారు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌(16.4వ ఓవ‌ర్‌)లో ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ అందుకోవ‌డంతో రోహిత్ పెవిలియ‌న్ చేర‌గా, షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో(17.5వ ఓవ‌ర్‌)లో అఘా సల్మాన్ చేతికి గిల్ చిక్కాడు. దీంతో 123 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 124/2. కేఎల్ రాహుల్‌(1), విరాట్ కోహ్లి(2) లు క్రీజులో ఉన్నారు..
తగ్గిన వర్షం..
వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో గ్రౌండ్‌ సిబ్బంది కవర్స్‌పై ఉన్న నీటిని తొలగించే పనిలో ఉన్నారు.