పాకిస్థాన్ ను మరోసారి చిత్తు చేసిన భారత్…!

ఆసియా కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా టోర్నమెంట్‌లో తమ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించాడు. ఫాఖర్ జమాన్ (15), సైమ్ అయూబ్ (21), మహమ్మద్ నవాజ్ (21) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శివమ్ దూబే 33 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు…

పాకిస్థాన్ ను మరోసారి చిత్తు చేసింది భారత్. ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ తొలి బంతినే సిక్సర్గా మలిచిన శర్మ, ఆ తర్వాత కూడా దూకుడును కొనసాగించాడు. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 28 బంతుల్లో 47పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్తో నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్‌ వర్మ (30*), హార్దిక్‌ (7*) సంజూ శాంసన్ 17 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫర్హాన్‌ (58;5×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. అయితే, బ్యాటింగ్‌ ప్రారంభించిన పాక్‌కు ఆదిలోనే హార్దిక్‌ పాండ్య కళ్లెం వేశాడు. మూడో ఓవర్లోనే ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (15) వెనక్కి పంపించాడు. ఆ తర్వాత తొలి డౌన్‌లో వచ్చిన సైమ్‌ ఆయుబ్‌ (21)తో కలిసి ఫర్హాన్ ఇన్నింగ్స్‌ నిర్మించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 93 పరుగులు జోడించి పాక్ను మెరుగైన స్థితిలో నిలిపారు..