ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మ‌ధ్య టీ 20 మ్యాచ్…

టి 20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో ఎలాగైనా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని అనుకుంటోంది. ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌రుగుతంది. ఈ మ్యాచ్‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో పాక్ కు భార‌త్‌లో ఆడే మ్యాచ్ చాలా కీల‌కం అని, ఎలాంటి భ‌యం, ఒత్తిడి లేకుండా ఆడితే త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తామ‌ని జావెద్ మియాందాద్ పేర్కోన్నాడు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌వంతు పాత్ర‌ను పోషించాల‌ని, అన్నారు. జ‌ట్టు కేవ‌లం బాబ‌ర్ మాత్ర‌మే ఆధార‌ప‌డ‌కుండా ఆడాల‌ని అన్నారు. టీ 20 క్రికెట్ అంటే సిక్స‌ర్లు, ఫోర్లు బాద‌డం మాత్ర‌మే కాద‌ని, స‌మ‌యం, ప్ర‌ణాళిక అవ‌స‌రం అని అప్పుడే విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని తెలిపారు…