టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టు..!!

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1 తో సమం అయింది..దక్షిణాఫ్రికా 55 పరుగులు, 176 పరుగులు చేయగా.. భారత్ 153 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 79 పరుగులు చేసి లక్ష్యాన్ని సాధించింది. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో మ్యాచ్‌ ఐదు సెషన్లలోనే ముగియడం విశేషం.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ (642) బంతుల్లో ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్‌ రికార్డుల్లోకెక్కింది. అంతకుముందు 1932లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ 656 బంతుల్లో ముగిసింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్‌ అయింది.

అతి తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టులు

642 – దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్‌ (కేప్‌టౌన్) 2024

656 – ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా (మెల్‌బోర్న్‌) 1932

672 – వెస్టిండీస్‌ వర్సెస్ ఇంగ్లాండ్ (బ్రిడ్జ్‌టౌన్) 1935

788 – ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (మాంచెస్టర్) 1888

792 – ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (లార్డ్స్) 1888.