స్కాట్లాండ్‌పై భారత్‌ 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం.. భారీగా పెరిగిన రన్‌ రేట్‌….

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నవంబర్ 8న నమీబియాపై కూడా భారత్‌ భారీ విజయం సాధించాలని….
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించిన భారత్‌.. స్కాట్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. దీంతో సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది….
86 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 6.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(16 బంతుల్లో 30, 5ఫోర్లు, 1సిక్స్‌) మెరుపు ఇన్ని‍ంగ్స్‌ ఆడంతో లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. దీంతో టీమిండియా రన్‌రేట్‌ భారీగా మెరుగు పడింది. ఈ విజయంతో గ్రూప్‌2లో భారత్‌ మూడో స్ధానానికి చేరుకుంది.
తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.5 ఓవర్లకు 70/1
దూకుడుగా ఆడుతున్న టీమిండియా 70 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ వికెట్‌ను కోల్పోయింది. 30 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ, వీల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు..
86 పరుగుల స్వల్ప లక్ష్యఛేధనతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతుంది. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా భారత్‌ 23 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్‌(15), రోహిత్‌(7) పరుగులతో ఉన్నారు….

కీలకమైన మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. టీమ్‌ఇండియా బౌలర్‌ మహమ్మద్‌ షమీ (3/14), జడేజా (3/15) స్కాట్లాండ్‌ను దెబ్బ తీశారు

పాయింట్ల పట్టికలో భారత్‌ (4 పాయింట్లు)
మూడో స్థానానికి చేరుకుంది.
ఈ గెలుపుతో భారత్‌ నెట్‌ రన్‌ రేట్‌ (+1.619) అఫ్గానిస్థాన్‌ (+1.481), న్యూజిలాండ్‌ (+1.277) కంటే మెరుగైన స్థితికి చేరింది. ..

నవంబర్‌ 7న కివీస్‌పై అఫ్గాన్‌ గెలుపొందాలని కోరుకుందాం

న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ పై ఆడుతున్న మ్యాచ్ ఓడిపోవాలని భారత క్రికెటర్లు కోరుకుంటున్నారు.. అదే కనుక జరిగితే భారత్ కి ఉన్న రన్ రెట్ తో ఈజీగా సెమీఫైనల్ కి వెళుతుంది…. అందుకే నెటిజన్లు ఓడిపోవాలి అంటూ ఆఫ్ఘనిస్తాన్ గెలవాలంటే భారత్ అభిమానులు కోరుకుంటున్నారు…న్యూజిలాండ్‌ జట్టు ఆప్ఘానిస్థాన్‌ చేతిలో తప్పనిసరిగి ఓడిపోవాల్సి ఉంటుంది. 6 పాయిం ట్లతో ఉన్న న్యూజిలాండ్‌.. ఆప్ఘానిస్థాన్‌పై గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్తుంది. అప్పుడు భారత్‌, ఆప్ఘాన్‌ ఇంటిదారి పడతాయి. ఒకవేళ ఆప్ఘాన్‌ గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకం కానుంది. ఇంతకముందే పాకిస్థాన్ సెమీస్ చేరగా, మరో జట్టుకు మాత్రమే సెమీస్‌ అవకాశాలు ఉన్నాయి..