*చరిత్ర సృష్టించిన భారత్*
IND vs SL:
శ్రీలంకతో తలపడిన మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అటు బ్యాట్‌తో, ఇటు బంతితోనూ విజృంభించి శ్రీలంకను చిత్తుగా ఓడించింది. తొలుత భారత్ నిర్దేశించిన 391 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక చతికిలపడిపోయింది. భారత బౌలర్ల విజృంభించడంతో 22 ఓవర్లకు 73 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. నవనిదు ఫెర్నాండో (19) టాప్‌స్కోరర్. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది.