వెస్టిండీస్‌పై తొలి టెస్ట్‌లో టీంఇండియా ఘన విజయం..

వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో టీంఇండియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను టీం ఇండియా 421/5 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు మన స్పిన్నర్ల ధాటికి కుప్పకులారు. కేవలం 50.3 ఓవర్లకు 130 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగులతో ఘన విజయం సాధించింది. అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో వెస్టిండీస్ బ్యాటర్లకు చుక్కలు చూయించాడు…ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చెలరేగిపోయాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ మరో వికెట్ తీశాడు. విండీస్ బ్యాంటింగ్ అలిక్ అథనాజె (28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో భారత్ రెండు టెస్ట్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో జైస్వాల్ 171 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కోహ్లి 76, రవీంద్ర జడేజా 37 పరుగులతో రాణించారు. తొలి మ్యాచ్‌లో 171 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. రెండో టెస్ట్ ఈనెల 20 నుంచి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ప్రారంభం కానుంది.