తొలి టి20లో భారత్ ఘనవిజయం….

కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మెరుపులతో బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత జట్టు....

కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మెరుపులతో బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత జట్టు.. బౌలింగ్ లోనూ విండీస్ కు చుక్కలు చూపింది. భారత బౌలర్ల ధాటికి టీ20 స్పెషలిస్టులుగా పేరున్న ఏ ఒక్క విండీస్ బ్యాటర్ కూడా క్రీజులో నిలువలేకపోయాడు.

తొలిమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్ కెప్టన్ పూరన్‌ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరువికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేయగలిగింది. దీంతో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచుల సిరీస్‌లో తొలిమ్యాచ్‌లో విజయంతో టీమిండియా బోణీ కొట్టింది.

కెప్టన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో ఏడు బౌండరీలు, రెండు సిక్సర్లతో 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దినేశ్ కార్తిక్ ఇన్నింగ్స్ చివరలో అద్భుతమైన బ్యాటింగ్ శైలితో 19 బంతుల్లో నాలుగు బౌండరీలు రెండు సిక్సర్లతో 41 పరుగులు అందించిం జట్టు స్కోరు పెరుగుదలలో కీలక పాత్రపోషించాడు. దీంతో దినేశ్ కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. వెస్టిండీస్ ఆటగాళ్ల దూకుడుకు టీమిండియా బౌలర్లు కళ్లెం వేసి తక్కువ పరుగులకే పరిమితం చేశారు…
విండీస్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దాంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ లు తలా రెండు వికెట్లు తీశారు. వెస్టిండీస్ తరఫున బ్రూక్స్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 సోమవారం జరుగుతుంది.