సౌతాఫ్రికా పై టీమిండియా గ్రాండ్ విక్టరీ..సిరీస్ కైవసం చేసుకున్న భారత్.

సౌతాఫ్రికా పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. టీమిండియా బ్యాటర్లలో శుభ్‌మన్‌ గిల్ (49), శ్రేయస్‌ (28) ఆయ్యర్ పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో ఫోర్టుయిన్‌, ఎంగిడి చెరో వికెట్ తీయగా, ధవాన్ రనౌట్ అయ్యాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 99 పరుగులకే ఆలౌట్ అయింది.
సౌతాఫ్రికాలో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా, ఏడుగురు బ్యాటర్లు కేవలం సింగిల్ డిజిట్‌ స్కోరుకే ఔటయ్యారు.భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, షాబాజ్‌ 2 చొప్పున వికెట్లు తీయగా, కుల్‌దీప్ యాదవ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. మూడో వన్డేలో గెలవడంతో టీమిండియా 21 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. అంతకుముందు సౌతాఫ్రికా పై గెలిచి టీ20 సిరీస్ ను సైతం టీమిండియా సొంతం చేసుకుంది.